క్యూబాలో ప్రజలు పేదోళ్లలాగా బతికి ధనికుల్లా చనిపోతారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. క్యూబా విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కు విచ్చేశారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు ముఖ్య అతిథులుగా వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు దేశమన్నారు.
చేగువేరాను కేవలం టీ షర్ట్స్, ఫోటోలలో మాత్రమే కాదని, ఆయన ఆదర్శాలను అందరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.‘‘నేను క్యూబా సాధారణ మహిళను. ప్రత్యేకమేమీ కాదు. మనం అందరినీ సమానత్వంతో చూడాలి. చేగువేరా చేసిన విప్లవాన్ని మనం ఆచరించాలి. నాన్న చేగువేరా సామాజిక సేవలో ముందుండే వారు. క్యూబాలో మహిళా ఫెడరేషన్ ఉంటుంది. ఆడ, మగ అనే వ్యత్యాసం ఉండదు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు’’ అని అలైదా గువేరా తెలిపారు.