సంక్రాంతి బరిలోకి వాల్తేరు వీరయ్యగా దూకిన మెగాస్టార్ చిరంజీవి.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వేట కొనసాగిస్తున్నాడు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మాహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు. దాంతో మెగా-మాస్ కాంబో ఫ్యాన్స్‌కు పూనకాలు తెపిస్తోంది. అందుకే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. జనవరి 13న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక నాలుగో రోజు వీరయ్య దూకుడు మామూలుగా లేదంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 74 కోట్ల షేర్.. 125 కోట్ల వరకు గ్రాస్‌ను వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ లెక్కన రేపో మాపో 100 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడం ఖాయమంటున్నారు. దాంతో మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా వాల్తేరు వీరయ్య నిలవనుందని అంటున్నారు. ఇక అమెరికాలో అయితే దుమ్ములేపుతున్నాడు వీరయ్య. అక్కడ వాల్తేరు వీరయ్య నాన్ RRR రికార్డ్ సెట్ చేసిందని అంటున్నారు. ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు క్రాస్ చేసేసింది. దాంతో ఈ వీకెండ్ వరకు వీరయ్యను ఆపడం కష్టమంటున్నారు. ఇకపోతే.. ఒక మెగాభిమానిగా అంచనాలకు తగ్గట్టుగా.. బాబీ ఈ సినిమాను తెరకెక్కించడంలో సక్సస్ అయ్యాడు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. రవితేజ జంటగా కేథరీన్ తెరిసా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. మొత్తంగా మెగాస్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.