పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రావాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి ‘మనల్ని ఆపేది ఎవడ్రా’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఎందుకు మారింతో ఫ్యాన్స్‌కు అంతు బట్టడం లేదు. టైటిల్‌తో పాటు కథ కూడా మరిందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పవన్-త్రివిక్రమ్ కలిసి హరీష్ అనుకున్న కథలో పలు మార్పులు చేసినట్టు తెలుస్తోంది. హరీష్ రాసిన వెర్షన్ బాగున్నప్పటికీ.. మరింత బలంగా ఉండాలని త్రివిక్రమ్‌ని రంగంలోకి దింపారట పవన్. కాకపోతే అవసరమైన మార్పులు మాత్రమే చేశారట. అందుకే ఇంతకాలం ముహూర్తానికి నోచుకోలేదని.. టైటిల్ కూడా మారిందని టాక్.. కానీ డైలాగుల విషయంలో మాత్రం హరీష్‌కే వదిలేశారట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రకటించినప్పుడు పూజ హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ హీరోయిన్ పేరు ప్రకటించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. దాంతో పవన్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా.. అనే టాక్ నడుస్తోంది. ఒకవేళ పూజా సై అన్నా.. పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి.. అమ్మడు కాస్త డైలామాలో ఉందని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు.