సంక్రాంతికి చిరు, బాలయ్యతో పాటు.. కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కూడా సై అంటున్నారు. అయితే తమిళ్లో విజయ్, అజిత్ బడా స్టార్స్. కానీ ఇక్కడ చిరు, బాలయ్యదే హవా. వీళ్ల మధ్యలో అరవ హీరోలు వస్తున్నారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. కానీ సంక్రాంతి పెద్ద సినిమా వారసుడు అనే టాక్ నడుస్తోంది. అయితే పెద్ద అంటే.. ఇంకేదో అనుకునేరు. రన్ టైం విషయంలో వారసుడు కాస్త ఎక్కువ నిడివితో రాబోతోందట. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ రన్ టైమ్ వచ్చేసి 2 గంటల 43 నిమిషాలకు లాక్ అయిందని టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య దాదాపు 2 గంటల 30 నిమిషాల నిడివితో రాబోతుందట. ఈ రెండు సినిమాలది డీసెంట్ రన్ టైం అని చెప్పాలి. అయితే అజిత్ ‘తెగింపు’ రన్ టైం మరీ తక్కువగా ఉంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 23 నిమిషాలున్నట్టు సమాచారం. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు రన్ టైం.. రెండు గంటల యాభై నిమిషాలు ఉందని అంటున్నారు. ఈ లెక్కన సంక్రాంతి పెద్ద సినిమా వారసుడు అనే చెప్పొచ్చు. అయితే వారసుడు సినిమా చూడాలంటే థియేటర్లో మూడు గంటలకు పైగా ఉండాల్సి ఉంటుంది. దాంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియెన్స్‌ను అంతసేపు థియేటర్లో కూర్చోపెడుతుందా.. లేదా అనేది సందేహాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటీని వారసుడు తట్టుకుంటాడా.. అనే నడుస్తోంది. ఇక ఇప్పుడు రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. చిరు, బాలయ్య మాత్రం కరెక్ట్ రన్‌టైంతో వస్తున్నారు. మరి రిలీజ్‌కు ముందే సంక్రాంతి పెద్దగా మారిన వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.