‘గాడ్ ఫాదర్’ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’గా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి ఈ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మాస్ రాజా పాత్ర దాదాపు 40 నిమిషాలకు పైగా ఉంటుందని వినిపించింది. అంతేకాదు.. రీసెంట్గా రిలీజ్ చేసిన రవితేజ టీజర్ చూసి.. ఇది మల్టీ స్టారర్ మూవీ అనే టాక్ కూడా ఊపందుకుంది. అలాగే రవితేజ పారితోషికం కూడా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వినిపించినట్టుగానే ‘వాల్తేరు వీరయ్య’ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడట రవితేజ. తను ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషికానికి సగం తీసుకుంటున్నాడట. ఆ లెక్కన దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు అందుకున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వాల్తేరు వీరయ్యకు మూడు వారాల ముందుగా.. డిసెంబర్ 23న ‘ధమాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు రవితేజ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం.. భారీగా ప్రమోట్ చేస్తున్నాడు మాస్ రాజా. తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు.. అభిమానులందరితోను ఫోటోలు దిగారు. అలాగే తనకోసం వచ్చిన వారందరికీ.. భోజనం ఏర్పాట్లు కూడా చేశారట. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.