మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం గత కొన్నేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పటి వరకు చూడని విధంగా తమ హీరోని జక్కన్న ప్రజెంట్ చేస్తాడనే ఊహలోకంలో తేలుతున్నారు. రాజమౌళి కూడా మహేష్‌తో ఊహకందని ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రాంచైజ్ కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్‌గా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని.. సూపర్ స్టార్‌తో హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయబోతున్నాడు జక్కన్న. అందుకోసం హాలీవుడ్ నటులే కాదు.. హాలీవుడ్ టాప్ ఏజెన్సీ సంస్థలతో రాజమౌళి టైఅప్ అవుతున్నారు. ఈ లెక్కన ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో 5, 6 వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే.. రాజమౌళి ప్లాన్ చూస్తుంటే.. అంతకు మించి బడ్జెట్ ఉండేలా ఉందంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. సినిమాకు ఫ్రాంచైజ్ అంటున్నారు కాబట్టి.. అది కాస్త ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. నిర్మాత కెఎల్. నారాయణ కూడా బడ్జెట్ గురించి అస్సలు ఆలోచించడం లేదట. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ బడ్జెట్ చూస్తుంటే.. తెలుగులో మీడియం రేంజ్ సినిమా తీసియొచ్చు. అయితే ప్రీ ప్రొడక్షన్‌కే అన్ని కోట్లంటే.. మహేష్‌తో రాజమౌళి ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా రాజమౌళి సినిమా అంటే.. ఆ మాత్రం ఉంటది మరి.