జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి చాలా కాలమవుతోంది. కానీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. అసలు 2022లోనే ఎన్టీఆర్ 30 ప్టార్ట్ కావాల్సింది. అది కూడా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఇప్పటి వరకు అదిగో, ఇదిగో అని ఊరిస్తునే ఉన్నారు. మధ్యలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా కాస్త ఊరటనిచ్చినా.. అనిరుధ్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశామని చెప్పినా.. ఇప్పటి వరకు మరో అప్డేట్ బయటకి రాలేదు. ప్రస్తుతం తారక్ ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు. తిరగొచ్చాక ఎన్టీఆర్ 30కి కొబ్బరికాయ కొట్టునున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ మధ్యన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపించినా.. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దాంతో మళ్లీ జాన్వీ కూడా డౌటే అనే టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలో అసలు ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరనేది తేలడం లేదు. అయితే ఒక్క హీరోయిన్ విషయంలోనే కాదు మిగతా స్టార్ట్ క్యాస్టింగ్లోను క్లారిటీ రావాల్సి ఉంది. అన్నట్టు ఈ మధ్యలో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. కాబట్టి.. ఎన్టీఆర్ 30 స్టార్ క్యాస్టింగ్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే.. మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఎన్టీఆర్ 30 నటీ నటుల గురించి అఫీషీయల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.