NDL: కోవెలకుంట్ల సమీపంలోని కుందూ నదిలో గల్లంతైన రవికుమార్ (40) మృతదేహాన్ని పోలీసులు ఇవాళ వెలికితీశారు. గాంధీనగర్‌కు చెందిన ఆయన శనివారం స్నానం కోసం నదిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.