»Actor Vadlamani Srinivas Exclusive Interview With Dev Tompala Hittvtalkies
Vadlamani Srinivas: 100 కోట్ల సినిమాలు 25పైనే చేశా..కానీ నా పేరు ఎవరికీ తెలియదు
గ్రూప్ 1 ఆఫీసర్‌గా పనిచేసి, నటనా రంగంలో రాణించడం సంతోషాన్ని ఇస్తుందని అయితే దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఒక్కొమెట్టు ఎలా ఎక్కారో ఆసక్తిగా వివరించారు వడ్లమని శ్రీనివాస్. తనకు ఇష్టమైన రచయిత ఎవరో, ఇండస్ట్రీలో తన మొదటి గురువు ఎవరో చెప్పారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చేసినా తన పేరును ప్రేక్షకులు గుర్తుపట్టకపోవడానికి గల కారణం కూడా వివరించారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Actor Vadlamani Srinivas Exclusive Interview With Dev Tompala HitTVTalkies
Vadlamani Srinivas: గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి నేడో, రేపో 100 సినిమాలు పూర్తి చేస్తానని తెలుగు యాక్టర్ వడ్లమని శ్రీనివాస్(Vadlamani Srinivas) అన్నారు. మొదట అధికారాన్ని చూసిన తాను ఇప్పుడు పాపులారిటీ సంపాదించుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. 47 ఏళ్ల తరువాత యాక్టింగ్ కెరియర్ ఎంచుకోవడానికి ముఖ్యకారణం ఎందుకో తెలిపారు. ఇన్ని సినిమాలు చేసినా తనకు పెదకాపు ఎంతో పేరు తెచ్చిందని, దీని వల్ల తనకు పెద్ద హీరోతో సినిమా ఇవ్వొచ్చని రుజువు చేసిందని ఆయన అన్నారు.
ఇక ఇండస్ట్రిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఎంత ఇష్టమో వివరించారు. ఆయన పాటలను పాఠాలకింద పెట్టాలని అన్నారు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనను చాలా మంది అవమానించారని కానీ తాను ఏది లెక్కచేయలేదని చెప్పారు. సినిమా అంటే ఏంటో చాలా అద్బుతమైన వివరణ ఇచ్చారు. తన జీవితంలో సినిమా ఎలా ఉపయోగిపడిందో తెలిపారు. రేపు ఐఏఎస్ ఎగ్జామ్ ఉంటే ఆ రోజు రాత్రి ఓ సినిమా వెళ్లిన స్టోరీని ఎంతో ఆసక్తిగా వెల్లడించారు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి చెప్పారు. ప్రభాస్, రామ్ చరణ్‌తో నటించడం ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో వివరించారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్‌తో ఓ సీన్ చేసేప్పుడు ఆయన ఏం మాట్లాడారో తెలిపారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే.