పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాను వచ్చే సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ nag ashwin చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి(Kalki)’ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో వస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ బ్యానర్ నిర్మాణంలో నాగ్ అశ్విన్(nag ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి గ్లింప్స్ సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్లో జెండా పాతేయడం గ్యారెంటీ అంటున్నారు ప్రభాస్(prabhas) ఫ్యాన్స్. విజువల్ వండర్‌గా రాబోతున్న కల్కి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్‌పై.. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథిగా విచ్చేశారు. ఈ సంద్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా వీఎఫ్ఎక్స్(VFX) వర్క్ మొత్తం ఇండియాలోనే చేయాలని.. మేకిన్ ఇండియా మూవీగా కల్కి 2898 ఏడీను తెరకెక్కించాలని కలలు కన్నాను. కానీ కథ, సినిమా గ్రాఫ్‌తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కారణంగా హాలీవుడ్ కంపెనీస్‌తో కలిసి గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే..ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాలోనే చేశామని తెలిపాడు. యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో భవిష్యత్తులో హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదని..హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థలు ఇండియా(india)లోనే ఉన్నాయని.. చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తాను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నా, వీఎఫ్ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగానని అన్నారు.