»Ntr Didnt Come To Varun Tej Lavanyas Wedding In Italy Trolls On Social Media
VarunLav: ఎన్టీఆర్ పరవు పోయిందిగా..ఫోటో వైరల్!
మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం ఇటిలీలో ఉంది. రేపటి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి కోసం అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు కూడా వెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. దీంతో ఆయన ఫోటోను వరుణ్ తేజ్ పక్కన నిల్చొబెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
NTR didn't come to Varun Tej-Lavanya's wedding in Italy.. Trolls on social media
VarunLav: మెగా ఫ్యామిలో పెళ్లి సందడి నెలకొంది. కుటుంబం అంతా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య వివాహాం(Tej-Lavanya wedding) కోసం ఇటలీ వెళ్లారు వారితో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఇటలీ చేరుకున్నారు. పెళ్లికి ముందు కాక్ టెయిల్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో వధూవరులతో ఫొటో షూట్ నిర్వహించారు. మెగా హీరోలు రామ్ చరణ్(Ramcharan), భార్య ఉపాసన, అల్లు అర్జున్(Allu Arjun), భార్య స్నేహారెడ్డి, సాయితేజ్, శిరీష్, వైష్ణవ్ తేజ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ ఫోటోలను ఓ ఆకతాయి ఎడిట్ చేసిన పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య పక్కన రామ్ చరణ్, ఉపాసన ఉన్నారు. ఆ ఫోటోకు ఎన్టీఆర్ ఫోటోను జత చేశారు. అయితే పోలీసు డ్రెస్‌లో ఉన్న బాద్షా స్టిల్‌ను నిల్చొబెట్టి ఎడిట్ చేశారు. ఈ ఫోటో ఎన్టీఆర్ ఎత్తును హేళన చేసేలా ఉంది. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నడుమ ఫ్యాన్ వార్‌కు దారి తీసేలా ఉంది.
మరోవైపు సినిమా ప్రముఖులు చాలా మంది వెళ్లిన ఈ వేడుకకు ఎన్టీఆర్(NTR) వెళ్లకపోవడం వెనుక కూడా చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా మంది దేవర, వార్2 షూటింగ్లలో బిజీగా ఉండడం మూలంగా వెళ్లలేదని అంటుంటే.. ఇంకొంత మంది ఆయనకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. మరి ఆయన ఏ కారణాల వలన ఇటలీకి వెళ్లలేదో తెలియదు కానీ ఈ విధంగా ఆయన హేటర్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా వ్యక్తిగతంగా ఇలా బాడీ షేమింగ్ చేయడం సరైనది కాదని పలువురు అంటున్నారు.