లియో(leo) సినిమా థియేటర్ కోసం ఓ వెర్షన్, ఓటిటిలోకి మరో వెర్షన్‌తో కొత్తగా రిలీజ్ కాబోతోంది. ఇదే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు. మరి లియో కొత్త వెర్షన్ ఎలా ఉండబోతోంది?
లియో(Leo) సినిమా బాగాలేదని జనాలు ఫస్ట్ డేనే చెప్పేశారు. అయితే ఏంటి? అది లోకేష్ కనగరాజ్ సినిమా కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిందని మేకర్స్ చెబుతున్నారు. వాస్తవానికైతే.. లియో సినిమాకు లోకేష్(lokesh kanagaraj) కాకుండా వేరే డైరెక్టర్ ఉండి ఉంటే.. వచ్చిన టాక్ ప్రకారం డిజాస్టర్ అయి ఉండేది. కానీ లోకేష్‌కున్న క్రేజ్‌కు టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లకు క్యూ కట్టారు జనాలు. దాని ఫలితమే ఇప్పటి వరకు రూ.540 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాటలో నడుస్తోంది.
ఇలాంటి సమయంలో లియో కొత్త వెర్షన్ రెడీ అవుతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. కొత్త వెర్షన్ అంటే థియేటర్లోకి రావడం లేదు.. ఓటీటీ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య వచ్చే సినిమాల రన్ టైం ఎక్కువైతే.. థియేట్రికల్ వెర్షన్ కోసం ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటిటిలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. కానీ లియో ఓటిటి వెర్షన్ మాత్రం వేరుగా ఉంటుందని అంటున్నారు. లియో థియేటర్ వెర్షన్‌కు, ఓటిటి వెర్షన్‌కు చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చాడు లోకేష్ కనగరాజ్. లియో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వటానికి , ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవటానికి ఉద్దేశించింది. కానీ ఓటీటీ వెర్షన్ వేరుగా ఉంటుందని అన్నాడు. దీంతో లియో కొత్త వెర్షన్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరి థియేటర్లో దళపతి ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన లోకేష్.. ఓటీటీ(OTT)లో ఎలాంటి కొత్త ట్రీట్ ఇస్తాడో చూడాలి.