Journalist TV5 Murthy: భారతరాజ్యంగం ఇచ్చిన భావప్రకటన ఆధారంగానే మీడియా పుట్టింది. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పడమే కానీ ఎలాంటి అధికారులు మీడియా ప్రతినిధులకు లేవు. ఒక న్యాయవ్యవస్థకు, పోలీసులకు, పోలిటికల్ అధికారులకు చాలా పవర్స్ ఉంటాయి. కానీ జర్నలిస్టులకు ఎలాంటి పవర్స్ ఉండవు పైగా పవర్లో ఉన్నవారితో పోరాడాలి అది జర్కలిజం గొప్పతనం అని జర్నలిస్ట్ మూర్తి చెప్పారు. జర్నలిస్టు ఈ సమాజంలో ఉన్న హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు అని పేర్కొన్నారు. అందుకే సినిమాలో తన హీరోకు ప్రశ్నించడం కోసం ఎంత దూరం అయిన వెళ్తాడు అని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్‌కు ప్రతినిధి2 సినిమాలో హీరోకు ఉన్న పోలిక ఏంటో వివరించారు. నిజానికి నగ్నసత్యాలు ఎలా ఉంటాయో ఈ సినిమాల్లో చూపించామని చెప్పారు. ఇక సినిమాల్లో చాలా విషయాలు చాలా నిజాయితీగా తీశామని చెప్పారు. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి.