»I Dont Want The Bad Name Of Manchoda Power Packed Teaser
Gangs of Godavari: మంచోడనే చెడ్డ పేరు నాకొద్దు.. పవర్ ప్యాక్డ్ టీజర్!
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో విశ్వన్ సేన్ ఊచకోత కోశాడు. దీంతో విశ్వక్ కెరీర్లోనే ఊరమాస్ సినిమాగా ఇది నిలిచేలా ఉంది.
I don't want the bad name of Manchoda.. Power Packed Teaser!
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశ్వక్. చివరగా గామి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మాస్ కా దాస్.. ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా.. అంజలి కీలక పాత్రలో.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో.. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మే 17న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో లంకల రత్న పాత్రలో ఊరమాస్‌గా కనిపించనున్నాడు విశ్వక్. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విశ్వక్ సేన్ ఊచకోత మామూలుగా లేదనే చెప్పాలి. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే.. ఆ మనిషిని చంపకుండా వదలరు.. అంటూ స్టార్ట్ అయిన టీజర్ చూస్తే.. విశ్వక్ కెరీర్లోనే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలిచేలా ఉంది. ఊరంతా ఒక్కటై చేసిన దండయాత్రను.. హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అసలు హీరోకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? అంటూ ఈ టీజర్‌ను కట్ చేశారు. అమ్మోరు పూనింది అంటూ.. విశ్వక్ సేన్ ఊరమాస్ లుక్‌లో ఊచకోత చేసినట్టుగా ఉంది. మంచోడనే చెడ్డ పేరు వద్దని.. విశ్వక్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.