ప్రస్తుతం డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. పోర్న్ వీడియోస్ చూస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది విద్యాబాలన్. ఇదిలా ఉండగానే.. విద్యా బాలన్ విడాకులు అనే న్యూస్ వైరల్‌గా మారింది.
Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి అందరికీ తెలిసిందే. డర్టీ పిక్చర్ సినిమాతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల ఆమె నటించిమ ‘దో ఔర్ దో ప్యార్’ సినిమా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేసింది విద్యా. ‘మీరు పోర్న్ సినిమాలు చూస్తారా?’ అని అడగ్గా.. ‘నేనెప్పుడూ కూడా పోర్న్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోయాను. నేను అలాంటవి చూడటానికి అస్సలు ఇష్టపడను. ఇద్దరు వ్యక్తుల శారీరక సంబంధాలను చూడటం నాకు ఇష్టం లేదు. సినిమాలో అలాంటి సీన్లు ఉంటే, తగిన రీతిలో షూట్ చేస్తే, దాని వెనుక మంచి కథ ఉంటే, అలాంటివి చూడ్డానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కథ ఉండదు, కేవలం సెక్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి, ఇలాంటి సన్నివేశాలను చూస్తూ నేను మాములుగా ఉండలేను. అందుకే చూడటం ఇష్టం లేదు.. అని పేర్కొంది.
ఇక అంతకు ముందు.. డర్టీ పిక్చర్ సినిమా కోసం సిగరెట్ తాగాల్సి వచ్చింది. దాంతో సిగరెట్ అలవాటు అయిందని చెప్పింది. రోజుకు రెండు మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదుని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. విద్యా బాలన్ తన భర్త సిద్దార్ధ్ రాయ్‌కు విడాకులు ఇవ్వాడానికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ గురించి తరచుగా ట్వీట్స్ చేసే బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ విషయం పై పోస్ట్ చేశాడు. ప్రస్తుతం విద్యా బాలన్, సిద్దార్ధ్ రాయ్ వేర్వేరుగా ఉంటున్నారని రాసుకొచ్చాడు. దీంతో.. విద్యా నిజంగానే విడాకులు తీసుకుంటుందా? అని సందేహాలు వెలువడుతున్నాయి. అన్నట్టుగా.. సినీ నిర్మాత సిద్దార్ధ్ రాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది విద్యా బాలన్.