డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి కొత్త రిలీజ్ డేట్ ఫైనల్‌గా బయటికి వచ్చేసింది. ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న తేదినే విడుదల చేయబోతున్నారు.
Kalki: సమ్మర్లో రావాల్సిన మోస్ట్ అవైటేడ్ మూవీ కల్కి రాకకై ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడింది. దీంతో కల్కి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా సరిగ్గా మరో రెండు నెలల్లో థియేటర్లోకి రానుందని అనౌన్స్ చేశారు. జూన్ 27న కల్కి రిలీజ్ కానుందని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో దీపిక, ప్రభాస్, అమితాబ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు మోత గ్యారంటీ అని అంటున్నారు. సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
మహా భారతాన్ని టచ్ చేస్తూ.. సైన్స్ ఫిక్షన్ మూవీగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 600 కోట్ల బడ్జెట్‌తో అశ్వనీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. దిశా పటానీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే.. దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. మొత్తంగా.. కల్కి పై హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను మరింతగా పెంచాయి. ముఖ్యంగా.. రీసెంట్గా రిలీజ్ అయిన అమితాబ్ గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరి కల్కి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.