• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్న తిమ్మప్ప దేవాలయం ఛైర్మన్

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, సతీమణి పద్మమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు వారిని శాలువతో సన్మానించి, ఘనంగా సత్కరించారు.

October 12, 2024 / 07:54 AM IST

కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్న తిమ్మప్ప దేవాలయం ఛైర్మన్

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, సతీమణి పద్మమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు వారిని శాలువతో సన్మానించి, ఘనంగా సత్కరించారు.

October 12, 2024 / 07:54 AM IST

పోలేరమ్మ అలంకరణలో మలలాంబిక దేవి

NRPT: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నారాయణపేట పట్టణంలో వైభవంగా జరుగుతున్నాయి. అశోక్ నగర్ వీధిలో వెలసిన మలలాంబిక దేవి 9 వ రోజు శుక్రవారం పోలేరమ్మ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కృష్ణ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మహా మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు.

October 12, 2024 / 07:13 AM IST

శ్రీవారి రథోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

NLR: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. రథంపై స్వామివారు కోలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ఈ రథోత్సవంతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. 

October 11, 2024 / 01:28 PM IST

దుర్గాదేవి నవరాత్రులలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

SRCL: దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా హన్మాజిపేట గ్రామంలో నవ దుర్గా సేవాసమితి, శ్రీ దుర్గా యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలుఅందజేశారు.

October 11, 2024 / 12:36 PM IST

మహా కామేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్

VZM: దత్తిరాజేరు మండలంలోని చౌదంతివలసలో గల మహాకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు అన్ని లాంఛనాలతో ఆహ్వానం పలికారు. అక్కడ నాయకులు అధికారులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

October 11, 2024 / 12:29 PM IST

కనకదుర్గమ్మ ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

SKLM: రణస్థలం మండలం సంచాం గ్రామంలో శుక్రవారం ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు . దసరా నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

October 11, 2024 / 12:26 PM IST

ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు

కృష్ణా: ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

October 11, 2024 / 11:59 AM IST

మహిషాసుర మర్దిని అలంకరణలో బన్నీ మహంకాళి

అనంతపురం: రాయదుర్గం పట్టణములో దేవీ శరన్నవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్దలతో ఘనంగా కొనసాగుతున్నాయి. శాంతినగర్‌లో బన్నీ మహాంకాలి అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకరణలో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. అమ్మవారిని దర్శించుటకు భక్తులు ఆలయానికి పోటెత్తారు.

October 11, 2024 / 11:13 AM IST

మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు

KDP: జమ్మలమడుగు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్య తీర్థము నందు దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన చేశారు. అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇచ్చారు.

October 11, 2024 / 10:19 AM IST

మధుర మీనాక్షి దేవి అలంకరణలో అమ్మవారు

ATP: దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం తొమ్మిదో రోజు గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి మధుర మీనాక్షి అమ్మవారి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

October 11, 2024 / 09:34 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,775 మంది భక్తులు దర్శించుకోగా.. 25,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 

October 11, 2024 / 07:21 AM IST

కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీశ్రీ భరత్

VSP: విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయాన్ని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

October 11, 2024 / 06:52 AM IST

నేడు మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నిత్యం వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా...

October 11, 2024 / 05:55 AM IST

దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్

VZM: పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్ గురువారం శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి పర్వదినాన పట్టణంలో శ్రీ విద్యా సర్వ మంగళ పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మురపాక కాళిదాసు యాజి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

October 11, 2024 / 04:13 AM IST