TG: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలొచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, స్వర్ణగిరి ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో భక్తులు ఆదివారం తెల్లవారుజాము పోటెత్తారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండోరోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతుంది. భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 25 వరకు ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేశారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల నియంత్రణకు కేరళ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 25, 26వ తేదీల్లో పరిమితంగా వర్చువల్, స్పాట్ బుకింగ్స్ సౌకర్యం కల్పించనుంది. 25న 50 వేల మంది, 26న 60 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం సప్తమి: మ. 3-13 తదుపరి అష్టమి పుబ్బ: ఉ. 7-41 తదుపరి ఉత్తర వర్జ్యం: మ. 3-34 నుంచి 5-19 వరకు అమృత ఘడియలు: రా. 2-05 నుంచి 3-50 వరకు దుర్ముహూర్తం: సా. 3-59 నుంచి 4-43 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.30; సూర్యాస్తమయం: సా.5.27
NGKL: బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ శ్రీ సార్థసప్త జేష్టమాతా సమేత శనీశ్వరస్వామికి శనివారం భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. అర్చకులు విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి నువ్వులు, జిల్లేడు పూలు, నువ్వుల నూనె, జిల్లేడు పూలు సమర్పించి తిల తైలాభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని పరమశివుని దర్శించుకుని అభిషేక పూజలు చేశారు.
AKP: దనుర్మాస వేడుకల్లో భాగంగా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకన్నకు శనివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకుని గోవింద నామస్మరణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస పూజలను ప్రత్యక్షంగా వీక్షించుటకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామిని కనులారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది
GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తెల్లవారుజాము నుంచే తిమ్మప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు ధ్వజ స్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టి ముడుపులు చెల్లించుకున్నారు.
SRPT: సిరిపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. శనివారం ఆరో రోజు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకు పూజతో పాటుగా, గోదాదేవి అమ్మవారికి కుంకుమ సహస్రనామార్చన, తిరుప్పావై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. జనవరి 14న గోదా కళ్యాణంతో పూజలు ముగుస్తాయని అర్చకులు వేదాంతం చక్రధరాచార్యులు తెలిపారు.
VSP: పాత డెయిరీ ఫారం కూడలిలోని పైడితల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి, కుంకుమార్చన జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు గోపీశర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకోగా.. 20,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం షష్ఠి: మ. 1-40 తదుపరి సప్తమి పుబ్బ: పూర్తి వర్జ్యం: మ. 2-28 నుంచి 4-12 వరకు అమృత ఘడియలు: రా. 12-47 నుంచి 2-30 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-28 నుంచి 7-56 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 6.29; సూర్యాస్తమయం: సా.5.26
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉండే ఇబ్బంది లేకుండా గంటలోనే దర్శనం అయ్యేలా చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు చేపట్టే పైలట్ ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టారు. గంటలోపు దర్శనం పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ నెల 24న జరగిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోద ముద్ర వేస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.