కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.1,73,903 ఆదాయం లభించిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 330 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని తెలిపారు.