అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి కూరగాయల అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదివారం వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన మాట్లాడుతూ.. పౌర్ణమి పురస్కరించుకొని నేడు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని తెలిపారు.
ATP: గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ వేకువ జామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు,వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో కాశినాయన ఆశ్రమంలో భగవాన్ శ్రీ కాశినాయన 29వ ఆరాధన మహోత్సవం సందర్భంగా నేడు కాశినాయన ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భజన కార్యక్రమం, తదుపరి భక్తులకు అన్నప్రసాదం వితరణ ఉంటుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. భక్తులు అందరు తరలి వచ్చి కాసినాయన కృపకు పాత్రులు కావాలని కోరారు.
KMM: ధనుర్మాస వ్రతాన్ని రేజర్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస రత్న శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య స్వామిచే ఈరోజు నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ వ్రతంతో పాటు శ్రీకృష్ణ దీక్ష కూడా ఆలయంలో నిర్వహిస్తున్నట్లు దేవాలయ ధర్మకర్తలు తెలిపారు.
VSP: విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి విశాఖ నగరం అల్లిపురం ప్రాంతానికి చెందిన కె.దుర్గ రూ. 1,00,000 విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ అధికారులకు అందజేశారు. దాతకు అమ్మవారి దర్శన సౌకర్యం కల్పించి ప్రసాదాన్ని అందజేశారు.
SKLM: శ్రీకాకుళం నగరంలో పి.ఎన్.కాలనీలోని నారాయణ తిరుమలలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి. శ్రీనివాసులు, ఈవో పి.శ్యామలరావు తెలిపారు. ఈనెల 16 తేదీ నుంచి జనవరి 14 వరకు తిరుప్పావై కార్యక్రమం, విశేష అర్చన పూజలు ఉంటాయన్నారు. జనవరి 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం ఉంటుందన్నారు. భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
TPT: రేపు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రేపు సాయంత్రం స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు తర్వాత దీపోత్సవం నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి శ్రీవారికి హారతి సమర్పిస్తారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉప దేవాలయాల్లో దీపాలు ఏర్పాటు చేస్తారు.
CTR: పుంగనూరులో వేంచేసియున్న శ్రీ శనేశ్వర స్వామికి శనివారం ఆలయ అర్చకులు, పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి రకరకాల సుగంధ ద్రవ్యాలు, గోక్షీరంతో అభిషేకం, ధీపనైవేద్యాలు సమర్పించారు. శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
JGL: కోరుట్లమండలంలోని సంగెం గ్రామంలో గల సంగమేశ్వర ఆలయ ఆవరణలో సామూహిక అష్టాదశ కళశ మహా పడిపూజను శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప ఆలయ అర్చకులు పాలెపు రాము శర్మ వైధిక నిర్వహణలో పుణ్యాహవాచనం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, గౌరీ, నవగ్రహ, శివలింగానికి అభిషేకం, అయ్యప్ప స్వామి పూజ, 18మెట్ల పూజను నిర్వహించారు.
TPT: దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో త్రయోదశి సందర్భంగా స్వామి అమ్మవారిని వెండి నంది వాహనంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో స్వామి అమ్మవారిని ఆలయావరణంలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన హారతులు సమర్పించారు.
TPT: కలియుగ దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డు తయారీ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు బ్రాహ్మణ శ్రీ వైష్ణవులకు మాత్రమే అర్హత ఉందని పేర్కొన్నారు. అర్హత అయిన వారికి నెలకు రూ. 30,000 వేతనంగా చెల్లించనున్నారు. అలాగే ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించారు.
ATP: గుంతకల్‌లోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ఆకు పూజ, సింధూరం పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ATP: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కొండపై గల హజ్రత్ సయ్యద్ భాష వలి దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పాల్గొని దర్గాలో సయ్యద్ బాషా వలి స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సయ్యద్ భాష వలి నామస్మరణతో దర్గా మారుమోగింది.