GDWL: అలంపూర్ క్షేత్రంలోని ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా ఉదయం జరిగే మహా మంగళహారతి పూజల వేళలో మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆదివారం తెలిపారు. నేటి నుండి ధనుర్మాసం ప్రారంభమై రాబోయే కొత్త సంవత్సరం జనవరి 14వ తేదీన ముగుస్తుందని పేర్కొన్నారు. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఉదయం మహా మంగళహారతి ప్రస్తుతం ఉదయం 6.30 గంటలకు ఉండగా 5.30 గంటలకు మార్చినట్లు తెలిపారు.
GDWL: జోగులాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, స్పర్శ దర్శనం పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా యాగశాలలో భక్తులు చండీహోమం నిర్వహించారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం పాడ్యమి: మ. 1-15 తదుపరి విదియ ఆర్ద్ర: తె. 3-00 తదుపరి పునర్వసు వర్జ్యం: ఉ. 11-42 నుంచి 1-16 వరకు అమృత ఘడియలు: సా. 5-12 నుంచి 6-46 వరకు దుర్ముహూర్తం: మ. 12-16 నుంచి 1-00 వరకు తిరిగి 2-28 నుంచి 3-12 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 6.26; సూర్యాస్తమయం: సా.5.24 ధనుర్మాస […]
TG: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం గురు పౌర్ణమి శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీ దత్తాత్రేయుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చన విశేష పూజలు నిర్వహించారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో, 15 డిసెంబర్ 2024 మధ్యాహ్నం 12.30 గంటలకు, అయ్యప్ప మాలదారులు శ్రీనివాస్ గుప్తా స్వామి బృందం అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేశారు. తదుపరి స్వామి వారిని పూలమాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం పడిపూజ కార్యక్రమం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి భవానీ దీక్ష విరమించనున్నారు. దీక్ష విరమణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భవానీ భక్తుల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే, భక్తుల గిరి ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
KMM: దమ్మపేట మండలం సీతారాంపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సొసైటీ చైర్మన్ రఘవరావు తదితరులు పాల్గొన్నారు.
KDP: కడప నగరంలోని స్థానిక బిల్డప్ సర్కిల్ సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో, ఆదివారం పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి కూరగాయల అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదివారం వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన మాట్లాడుతూ.. పౌర్ణమి పురస్కరించుకొని నేడు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని తెలిపారు.
ATP: గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ వేకువ జామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు,వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో కాశినాయన ఆశ్రమంలో భగవాన్ శ్రీ కాశినాయన 29వ ఆరాధన మహోత్సవం సందర్భంగా నేడు కాశినాయన ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భజన కార్యక్రమం, తదుపరి భక్తులకు అన్నప్రసాదం వితరణ ఉంటుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. భక్తులు అందరు తరలి వచ్చి కాసినాయన కృపకు పాత్రులు కావాలని కోరారు.
KMM: ధనుర్మాస వ్రతాన్ని రేజర్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస రత్న శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య స్వామిచే ఈరోజు నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ వ్రతంతో పాటు శ్రీకృష్ణ దీక్ష కూడా ఆలయంలో నిర్వహిస్తున్నట్లు దేవాలయ ధర్మకర్తలు తెలిపారు.
VSP: విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి విశాఖ నగరం అల్లిపురం ప్రాంతానికి చెందిన కె.దుర్గ రూ. 1,00,000 విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ అధికారులకు అందజేశారు. దాతకు అమ్మవారి దర్శన సౌకర్యం కల్పించి ప్రసాదాన్ని అందజేశారు.