ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది మహాకుంభమేళా ప్రారంభంకానుంది. దీని ఏర్పాట్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.1050 కోట్లు విడుదల చేసింది. జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు ప్రయాగ్ రాజ్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని మహాకుంభమేళా అని యూపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమన్త రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం తదియ: మ.12-21 తదుపరి చవితి పూర్వాషాఢ: సా.5-11 తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: రా.1-10 నుంచి 2-46 వరకు అమృత ఘడియలు: మ.12-18 నుంచి 1-56 వరకు దుర్ముహూర్తం: ఉ.11-27 నుంచి 12-11 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6.19; సూర్యాస్తమయం: సా.5.20
AP: TTD ఛైర్మన్ BR నాయుడు ఇవాళ తిరుమలలో భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సలహాలు సూచనలు స్వీకరించారు. ‘తిరుమలలో సామాన్య భక్తుల క్యూలైన్లను, నారాయణగిరి షెడ్లను, దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను పరిశీలించాను. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌ను పరిశీలించి, భక్తుల సూచనలు తీసుకున్నాను. త్వరలోనే దర్శన విధానాలపై సమగ్రంగా చర్చిస్తాం. సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్...
JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 బుధవారం నుండి ఆలయములో నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి నాగరాజు రమేష్ తెలిపారు. మొదటిసారి నిర్వహించు బ్రహ్మోత్సవాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆలయ కమిటీ ఆహ్వానించడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.5,35,41,432 వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం హాల్ రెండులో హుండీ లెక్కింపు చేశారు. మిశ్రమ బంగారం 215 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 23,248 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినట్లు పేర్కొన్నారు.
CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు రూ.1,49,62,798, గో సంరక్షణ హుండీ రూ.11,708, అన్నదానం హుండీ ద్వారా రూ.31,751 ఆదాయం వచ్చిందని ఈవో గురు ప్రసాద్ తెలిపారు. అలాగే బంగారు 5. గ్రా, వెండి 2. కిలోల 785. గ్రా. ఇతర దేశాల కరెన్సీ డాలర్స్ 526. యూఏఈ ధీరమ్స్- 10. మలేషియా రింగ్స్ 178, ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
CTR: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచారకర్త చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం ఈనెల 14, 15 తేదీలలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేస్తున్నట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి మంగళవారం ప్రకటించారు. 14వ తేదీన వేయి లింగాలకోనలోని సహస్ర లింగేశ్వరుని దర్శించుకుంటారని,15వ తేదీ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సుమారు 150 నుంచి 200 మంది పాల్గొంటారని ఈవో తెలిపారు.
CTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు తిరుమల దర్శన మార్గాలను పరిశీలించారు. ఏటీజీహెచ్, నారాయణగిరి షెడ్లు, ఫుట్‌పాత్ హాల్ (దివ్య దర్శనం)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెరుగైన లడ్డూ రుచి, అన్నప్రసాదం నాణ్యతను భక్తులు ప్రశంసించారు. కొందరు వేగవంతమైన రూ.300 దర్శనాన్ని అభ్యర్థించారు. మెరుగైన ఏర్పాట్లకు సమీక్షిస్తామని ఛైర్మన్ వారికి హామీ ఇచ్చారు.
కోనసీమ: గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలనాధికారి కే. హర్షవర్ధన్ మంగళవారం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామిని దర్షించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ పర్యవేక్షణాధికారి కఠారి శ్రీనివాస రాజు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో దర్శనం చేయించి, స్వామి చిత్ర పటం అందజేశారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీన జరిగే హనుమాన్ వ్రత్ మహోత్సవాల ఏర్పాట్లపై రేపు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వాణి మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 11 గంటలకు శ్రీరామదూత నీలయంలో వివిధ శాఖల అధికారులతో ఈ సమావేశం జరుగుతుందన్నారు.
CTR: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు.
KDP: కడప నగరంలోని స్థానిక బిల్డప్ సర్కిల్ నందు వెలసిన శ్రీ విజయ దుర్గా దేవి ఆలయం నందు మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
W.G: పాలకొల్లు పట్టణం యడ్ల బజారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైయ్యారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాదాల వితరణ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు రమణ గురుస్వామి పర్యవేక్షించారు.
AP: తిరుపతి స్థానికులను ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల వాసులకు దర్శన అవకాశం కల్పించనుంది. ఇకపై ప్రతినెలా తొలి మంగళవారం స్థానికులు శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది.
GDWL: అలంపూర్ 5 వ శక్తిపీఠం బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిహెచ్ రంగరాజన్ ఉభయ ఆలయాలను సోమవారం దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈఓ పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థ ప్రసాదాలు అందించారు. ఆశీర్వచన మండపంలో బాల బ్రహ్మేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించి శేష వస్త్రంతో సత్కరించారు.