JGL: కోరుట్ల పట్టణంలోని చెరువు కట్ట క్రింద గల అతిపురాతన గుంటి పెరుమాండ్ల స్వామి జాతర మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సెన ఆరాధన, పుణ్యాహ వాచనం, స్వామి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు చింత సునీల్ స్వామి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాదులు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథం పై ఊరేగించారు.