SKLM: శ్రీకాకుళం నగరంలో పి.ఎన్.కాలనీలోని నారాయణ తిరుమలలో ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి. శ్రీనివాసులు, ఈవో పి.శ్యామలరావు తెలిపారు. ఈనెల 16 తేదీ నుంచి జనవరి 14 వరకు తిరుప్పావై కార్యక్రమం, విశేష అర్చన పూజలు ఉంటాయన్నారు. జనవరి 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం ఉంటుందన్నారు. భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
TPT: రేపు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రేపు సాయంత్రం స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు తర్వాత దీపోత్సవం నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి శ్రీవారికి హారతి సమర్పిస్తారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉప దేవాలయాల్లో దీపాలు ఏర్పాటు చేస్తారు.
CTR: పుంగనూరులో వేంచేసియున్న శ్రీ శనేశ్వర స్వామికి శనివారం ఆలయ అర్చకులు, పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి రకరకాల సుగంధ ద్రవ్యాలు, గోక్షీరంతో అభిషేకం, ధీపనైవేద్యాలు సమర్పించారు. శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
JGL: కోరుట్లమండలంలోని సంగెం గ్రామంలో గల సంగమేశ్వర ఆలయ ఆవరణలో సామూహిక అష్టాదశ కళశ మహా పడిపూజను శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప ఆలయ అర్చకులు పాలెపు రాము శర్మ వైధిక నిర్వహణలో పుణ్యాహవాచనం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, గౌరీ, నవగ్రహ, శివలింగానికి అభిషేకం, అయ్యప్ప స్వామి పూజ, 18మెట్ల పూజను నిర్వహించారు.
TPT: దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో త్రయోదశి సందర్భంగా స్వామి అమ్మవారిని వెండి నంది వాహనంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో స్వామి అమ్మవారిని ఆలయావరణంలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన హారతులు సమర్పించారు.
TPT: కలియుగ దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డు తయారీ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు బ్రాహ్మణ శ్రీ వైష్ణవులకు మాత్రమే అర్హత ఉందని పేర్కొన్నారు. అర్హత అయిన వారికి నెలకు రూ. 30,000 వేతనంగా చెల్లించనున్నారు. అలాగే ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించారు.
ATP: గుంతకల్‌లోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ఆకు పూజ, సింధూరం పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ATP: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కొండపై గల హజ్రత్ సయ్యద్ భాష వలి దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పాల్గొని దర్గాలో సయ్యద్ బాషా వలి స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సయ్యద్ భాష వలి నామస్మరణతో దర్గా మారుమోగింది.
TPT: నారాయణవనం మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం ఉంజల్ సేవ జరిగింది.
కోనసీమ: మండల కేంద్రమైన అయినవిల్లిలో వేంచేసి యున్న విగ్నేశ్వర స్వామిని శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారికి సమర్పించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ.1,21,831 ఆదాయం లభించినట్లు ఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు.
TPT: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీన బుధవారం సంకటహర చతుర్థి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. రాత్రి పురవీధుల్లో స్వర్ణ రథోత్సవం వేడుకలు ఉంటాయన్నారు.
KDP: మండల పరిధిలోని మల్లూరు గ్రామంలో వెలసిన వల్లూరమ్మ తల్లికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ఆవరణలో గల శ్రీ త్రిశక్తి ఆలయంలో, 13 డిసెంబర్ 2024 శుక్రవారం రోజు ఉదయం, మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా, శ్రీ త్రిశక్తి అమ్మవార్లకు, ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం అమ్మవార్లని నూతన వస్త్రములతో, పూల మాలలతో సుందరంగా అలంకరించారు. దీప ధూపాలను వెలిగించారు, నైవేద్యాన్ని సమర్పించారు.