BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మ తల్లి) అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి నీరాజనం, నివేదన, మంత్రపుష్పం, హారతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు 108 పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఈ పూజలలో ఆలయ కార్యనిర్వహణాధికారి, భక్తులు పాల్గొన్నారు.