ATP: గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.