RR: తలకొండపల్లి మండలం రాంపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో చక్ర తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.