VZM: దత్తిరాజేరు మండలం గడసాం కనకదుర్గమ్మవారి మెడలో మంగళసూత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీపారాధన చేసేందుకు మంగళవారం సాయంత్రం గుడి తలుపులు తెరవగా మంగళసూత్రాలు లేవని ఆలయ కమిటీ సభ్యులు సుంకర శివ, సుంకర కృష్ణ, గ్రామ సర్పంచ్ ఎన్. దీపిక తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్ఐ జయంతి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం ఏకాదశి: రా. 10.43 తదుపరి ద్వాదశి రేవతి: ఉ. 10-03 తదుపరి అశ్విని వర్జ్యం: తె. 4-39 నుంచి 6-08 వరకు అమృత ఘడియలు: ఉ. 7-49 నుంచి 9-18 వరకు తిరిగి రా. 1-41 నుంచి 3-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-31 నుంచి 12-15 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 01-30 వరకు సూర్యోదయం: ఉ. 6.24; సూర్యాస్తమయం: సా.5.23 […]
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమై ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పండుగ వేళల్లో, రద్దీ సమయాల్లో స్వామి వారి స్పర్శ దర్శనం వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అన్ని వేళల స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
NLG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు ఒక్కరోజు అయ్యప్ప మాలధారణ భక్తులకు ఉచిత దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్పమాల వేసుకున్న భక్తులు రేపు ఉదయం 6గంటలకు సామూహిక గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
ATP: కూడేరు మండల కేంద్రంలో ఈనెల 13న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ అర్చకుడు రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని కావున మండల ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.
శబరిమలకు వెళ్లే మహిళా భక్తులకు శుభవార్త. మహిళల కోసం కేరళ ప్రభుత్వం పంపా బేస్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. నిన్న వసతి గృహాన్ని ప్రారంభించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 50 మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది. దీంతో మహిళా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
W.G: అత్తిలి శ్రీవల్లీదేవసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ రఘురామ్ నాయుడు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా రఘురామ్ దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ తరపున స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు.
VSP: సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం దశమి: రా. 1-04 తదుపరి ఏకాదశి ఉత్తరాభాద్ర: ఉ. 11-42 తదుపరి రేవతి వర్జ్యం: రా. 10-52 నుంచి 12-21 వరకు అమృత ఘడియలు: ఉ. 7-13 నుంచి 8-42 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-34 నుంచి 9-18 వరకు రా. 10-34 నుంచి 11-26 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 6.23; సూర్యాస్తమయం: సా.5.22
శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. పంబ నుంచి సన్నిధానం వరకు స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న అయ్యప్ప స్వామిని 90 వేల మంది దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు దర్శన సమయం పెంచింది. స్పాట్ బుకింగ్స్ కోటా కూడా పెంచినట్లు తెలిపింది.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఉప ఆలయంలో నేటి నుంచి దత్తాత్రేయస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉత్సవాలు దత్త జయంతి వరకు 9 రోజులపాటు నిత్యం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ వివరించారు.
HYD: పద్మారావునగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి పాల్గొన్నారు.
SRD: జహీరాబాద్ మండలం వస్తాపూర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో 18 కలశాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. గురుస్వాములు పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.