RR: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే శంకర్‌ను సన్మానించారు.
NZB: నగరంలోని ఆర్టీసీ కాలనీ శ్రీ శక్తిమాన్ హనుమాన్ మందిరం వద్ద 12 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రతిష్ఠాపన కోసం బుధవారం భూమి పూజ నిర్వహించారు. గుడి అధ్యక్షుడు, విగ్రహ దాత గుజ్జల హనుమంతు రెడ్డి దంపతులు భూమిపూజలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫిబ్రవరి 2న ప్రతిష్ఠాపన చేస్తామని గుడి కమిటీ సభ్యులు తెలిపారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో గురుస్వామి దీకొండ యుగంధర్ ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా మహాపడిపూజ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గదస్వామి చందు అశోక్ పడి ముట్టించి అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజనతో పడిపూజ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మారుమరోగింది. అనంతరం వచ్చిన భక్తులకు అయ్యప్పస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు.
GDL: మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఛైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 13న కళ్యాణోత్సవం,14న తెప్పోత్సవం నిర్వహించనున్నామని, ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు.
NLG: చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ జాతరను ఈ నెల 15న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యులు బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది జరుపుకునే ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఏపీ రాష్ట్రం నుంచి భక్తులు భారీగా వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకృష్ణుని మందిరంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు స్వామివారి మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత తులసి మాలలు, వివిధ పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ప్రకాశం: నంద్యాల జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి వారు వెలసిన శ్రీశైల క్షేత్రాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఉదయం టీడీపీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
శ్రీకాకుళం పట్టణం అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. ప్రతీ ఏటా ఈ పర్వదినాన కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి కళ్యాణం చూసినందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
VZM: దత్తిరాజేరు మండలం గడసాం కనకదుర్గమ్మవారి మెడలో మంగళసూత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీపారాధన చేసేందుకు మంగళవారం సాయంత్రం గుడి తలుపులు తెరవగా మంగళసూత్రాలు లేవని ఆలయ కమిటీ సభ్యులు సుంకర శివ, సుంకర కృష్ణ, గ్రామ సర్పంచ్ ఎన్. దీపిక తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్ఐ జయంతి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం ఏకాదశి: రా. 10.43 తదుపరి ద్వాదశి రేవతి: ఉ. 10-03 తదుపరి అశ్విని వర్జ్యం: తె. 4-39 నుంచి 6-08 వరకు అమృత ఘడియలు: ఉ. 7-49 నుంచి 9-18 వరకు తిరిగి రా. 1-41 నుంచి 3-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-31 నుంచి 12-15 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 01-30 వరకు సూర్యోదయం: ఉ. 6.24; సూర్యాస్తమయం: సా.5.23 […]
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమై ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పండుగ వేళల్లో, రద్దీ సమయాల్లో స్వామి వారి స్పర్శ దర్శనం వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అన్ని వేళల స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
NLG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు ఒక్కరోజు అయ్యప్ప మాలధారణ భక్తులకు ఉచిత దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్పమాల వేసుకున్న భక్తులు రేపు ఉదయం 6గంటలకు సామూహిక గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
ATP: కూడేరు మండల కేంద్రంలో ఈనెల 13న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ అర్చకుడు రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని కావున మండల ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.