HYD వెంగళరావునగర్ GTS దేవాలయం వద్ద ఎనిమిదవ రోజు నవరాత్రి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓవైపు సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతుండగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబం మొత్తం సుఖశాంతులతో ఉండేలా అమ్మవారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని భక్తులు కోరుకున్నారు.
ATP: రాయదుర్గం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్తి రేణుక ఎల్లమ్మ సోమవారం సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు అభయం ఇచ్చింది. దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా 8వ రోజు అమ్మవారికి పురోహితులు రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ఇవాళ దర్శించుకుంటే సరస్వతి దేవి కరుణాకటాక్షం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.
W.G: కోనేరుపేటలో టీటీడీ కళ్యాణ మండపం వద్ద కోనేరుపేట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 21వ సంవత్సరంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు పిల్లలచే విశేషమైన సరస్వతీ పూజ కూడా జరిపించనున్నట్లు తెలిపారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. దర్శనం కోసం భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 79,496 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
AP: ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అధికారులు భక్తుల జల్లు స్నానాలకు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి భవానీ మాలధారణ భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో వినాయకగుడి నుంచి 2 కి.మీ మేర భక్తులు బారులు తీరారు. ఎగువ నుంచి కృష్ణాకు వరద వస్తుండంటంతో నదిలోకి స్నానాలకు వెళ్లొద్దని భక్తలను హెచ్చరించారు.
NDL: బేతంచెర్ల మండలం పరిధిలో వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు ఇవాళ దర్శనమిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు వేద పండితులు జ్వాల చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం అమ్మవారిని రథంపై ఊరేగింపు చేశారు.
సత్యసాయి: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు భక్తులకు శ్రీ పరమపధనాధ అలంకరణలో ఖాద్రీ నృసింహస్వామి దర్శనం ఇచ్చారు. భక్తులు దర్శించుకుని స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.
శ్రీ విశ్వావసునామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం సప్తమి: మ.12:05 తదుపరి అష్టమి మూల: తె.3:13 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ.9:51-11:35 వరకు తిరిగి రా.1:29-3:13 వరకు అమృత ఘడియలు: రా.8:16-10 వరకు దుర్ముహూర్తం: మ.12:15-1:03 వరకు తిరిగి 2:38-3:26 వరకు రాహుకాలం: ఉ.7:30-9:00 సూర్యోదయం: ఉ.5:53; సూర్యాస్తమయం: సా.5:50 సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్ర వ్రతం.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిలో రేపు అర్ధరాత్రి వరకు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఇవాళ రాత్రి 11 గంటల నుంచి భక్తులను క్యూలైన్‌లోకి అనుమతి ఇస్తున్నారు. 3 లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. అలాగే, రేపు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
NLR: బుచ్చి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి
KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో స్వామి అమ్మవార్ల రథసేవ ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులు స్వయంగా వారి చేతులతో ఈ రథాన్ని లాగి స్వామివారి సేవలో కొనియాడారు. వీకెండ్ కావడంతో రత్నగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులంతా ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు.
NLR: దేవి శరన్నవరాత్రులులో భాగంగా ఉదయగిరి శ్రీ పార్వతీ సమేత శివాలయంలో అమ్మవారు ఏడవ రోజు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనిల్ మాట్లాడుతూ.. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహంకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అవతారం ఉద్భవించింది అన్నారు.
AP: తిరుమలలో గరుడ వాహనసేవ ప్రారంభమైంది. తిరుమాడ వీధుల్లో కన్నుల పండువగా గరుడ సేవ కొనసాగుతోంది. ఈ క్రమంలో గరుడ సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. మాడవీధుల్లో గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులు బారులు తీరారు. వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. తిరుమలలో పూర్తిగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి.
CTR: దసరా మహోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయాన్నే అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
TPT: ఏర్పేడు మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఆమందూరు గ్రామ దేవత ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి భారీగా మహిళా భక్తుల తరలివచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భారీగా పాల్గొన్నారు.