AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆరో రోజు దుర్గమ్మ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఉదయం 4 నుంచి రాత్రి 12:30 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. కుంకుమార్చనకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ మాలధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.
ప్రకాశం: యర్రగొండపాలెంలోని స్థానిక అమ్మవారిశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు మార్కాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అన్నా రాంబాబు పాల్గొన్నారు. ప్రజలకు ఏప్పుడు మంచి జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారు నంది గరుత్మంతుడు వాహానంపై గ్రామ సేవ నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించిన అనంతరం కూష్మాండ అలంకారంలో ఉన్న అమ్మవారిని. నంది గరత్మంతుడుపై విహారించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి (స్కందమాత) అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని డబ్బుల నోట్లతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు.
RR: షాద్‌నగర్ పట్టణ సమీపంలోని ఎలికట్ట అంబా భవాని మాత ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు.
NTR: ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. దీంతో ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ అమ్మవారి యొక్క భక్తులతో నిండిపోయాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా అమ్మవారిని భక్తులు ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయానికి ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. దేవీ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని ఉదయాన్నే అర్చకులు అభిషేకాలు పూజలు నిర్వహించి, అమ్మవారిని వెన్నతో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
CTR: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు.
ప్రకాశం: కనిగిరి దరువు బజార్లో వెలసి ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన గురువారం ఈశ్వరి మాత అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆకుమల్ల విశ్వరూప ఆచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NDL: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానందిలో ఇవాళ శతచండీ యాగం రుద్రహోమం చండీ హోమం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో పండితులు రుత్వకులు స్థానిక శతచండి యాగశాలలో ఉభయ దాతల ద్వారా పూజలు చేపడుతున్నారు. నవరాత్రి ఉత్సవాలు కావడంతో మహానంది ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ కామేశ్వరి దేవి శ్రీమహానందీశ్వర స్వామి వాళ్ళను దర్శించుకున్నారు.
NDL: బనగానపల్లె మండలంలో నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల 4 వ రోజు ఇవాళ విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రాత కాలంలో అష్టైశ్వర్య మహా మంగళం నిరాజనం మహా నివేదన చేశారు. అనంతరం అమ్మవారిని శ్రీ కూష్మాండ దుర్గా రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
HNK: హన్మకొండలో ప్రసిద్ధిగాంచిన శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు బుధవారంతో మూడవ రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ అవధాని తెలిపారు. మూలమూర్తికి షోడశ కలశాలతో మహానారాయణ ఊపనిషత్తుతో అభిషేక కార్యక్రమం నిర్వహించి, చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు.