KDP: ప్రొద్దుటూరులో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామున నుంచి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను ఆర్యవైశ్య సభ సభ్యులు భక్తులకు అందించారు.
ADB: జైనద్ మండలం బాలాపూర్ గ్రామంలోని వాసుకేశ్వర శివాలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా మహాదేవుని పల్లకి ఊరేగింపు నిర్వహించారు. భజన కీర్తనలతో డప్పు, చప్పుళ్ల మధ్య ఆడవాళ్లు పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా గ్రామంలోని పలు వీధుల గుండా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
GDWL: మల్దకల్ మండలం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఇల్లూరు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బాదం శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం స్థాపకులు నాగరాజు, యన్ వెంకటేష్ పాల్గొన్నారు.
AP: ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులకు ముస్తాబవుతోంది. దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే అక్టోబర్ 3న ఘటస్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. 12న విజయదశమి వేడుకతో నవరాత్రులు ముగుస్తాయని చెప్పారు. 12న సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
NRML: నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం శ్రీ కమలానంద భారతి స్వామి పీఠాధిపతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతకు ముందు వారికి మాజీ సర్పంచ్ సతీష్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగరావు, మనోహర్ రావు తదితరులున్నారు.
SRCL: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరిగే శ్రీదేవి నవరాత్రోత్స ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారికి మండపం నిర్మాణం, విగ్రహాలను శుభ్రం చేసే పనులకు ఆలయ అధికారులు నేడు శ్రీకారం చుట్టారు.
HNK: హన్మకొండ నగరంలోని సిద్దేశ్వర ఆలయంలో శ్రీ భవాని మాతను శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు సిద్దేశ్వర సురేష్ కుమార్ భవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించే అలంకరించారు. శుక్రవారం సందర్భంగా నగరంలోని మహిళలు సిద్దేశ్వర ఆలయంలోని భవాని మాతను దర్శించుకుంటున్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,328 మంది భక్తులు దర్శించుకోగా.. 22,033 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
MDK: కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బోరంచ నల్ల పోచమ్మకు శుక్రవారం అర్చకులు సిద్దూ స్వామి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. బృగువాసరే పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అర్చన, ఆరాధన పూజలతో అలంకరించి మహామంగళ హారతి నిరాజనం చేశారు. పండ్లు ఫలాలు నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు నల్ల పోచమ్మ దర్శనం చేసుకున్నారు.
MDK: శ్రీ ఏడుపాయల క్షేత్రంలోని రాజగోపురం వద్ద భవాని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శుక్రవారం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం పూజలు చేశారు. పలు విధ ద్రవ్యాలు, నిమ్మకాయలు, గాజులు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి, రకరకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ధూప, దీపం, పండ్లు, ఫలాలు నైవేద్యం సమర్పించి మంగళహారతి చేశారు.
AP: తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలతో శనివారం కాలినడకన తిరుమల వెళ్తానని మాజీ సీఎం జగన్ చెప్పారు. వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. లడ్డూకు వాడే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని.. చంద్రబాబు కావాలనే దేవుడితో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అయితే జగన్ తిరుమల టూర్‌తో ఆయనపై వచ్చిన ఆరోపణలు తొలిగిపోయినట్లేనా.. మీ అభి...
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఇవాళ శాంతిహోమం నిర్వహించనున్నారు. సర్వదోష నివారణార్థం ప్రభుత్వ ఆదేశాలతో శాంతిహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో హోమం నిర్వహిస్తున్నారు. ఈవో రామారావు సమక్షంలో ఆలయంలోని చండీ యాగశాలలో హోమం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం నవమి: సా. 4-25 తదుపరి దశమి పునర్వసు: తె. 3-59 తదుపరి పుష్యమి వర్జ్యం: మ. 3-50 నుంచి 5-27 వరకు అమృత ఘడియలు: రా. 1-33 నుంచి 3-10 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ. 2-40 నుంచి 3-28 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 5.53; సూర్యాస్తమయం: సా.5.53.
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం1907: ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్య్ర సమరయోధుడు, చరిత్రకారుడు మరణం1923: హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం1999: పీ సుదర్శన్ రెడ్డి నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు జననం➢ ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం, యెమెన్ రెవల్యూషన్ డే, చెవిటి వారి దినోత్సవం,యూరోపియన్ భాషల దినోత్సవం, ప్రపంచ గర్బ నిరోధక దినోత్సవం.