KMM: టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తిరుపతిరావు సహకారంతో అయ్యప్ప స్వాములు శ్రీను ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి రెడ్డి హాజరై ప్రారంభించారు. 41 రోజులపాటు ఎంతో పవిత్ర దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యమని సీఐ తెలిపారు.