NDL: లోక కళ్యాణం కోసం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి వారికి జ్వాలావీరభద్ర స్వామి వారికి బుధవారం సాయంత్రం విశేష పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలా మకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. మహాగణపతి పూజ తదుపరి వీర భద్ర స్వామికి పూజలు చేశారు.