AP: శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు TTD చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మందిని నియమించేందుకు సిద్ధమయింది. ఇప్పుడు TTD 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో కన్నా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సాల సమయంలోనూ డిమాండ్‌కు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తోంది.