GDL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు జరగనున్న మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరుకావాలని ఉడిపి పలిమారు పీఠాధిపతి విద్యా దిశ తీర్థ స్వామిని బుధవారం ఆహ్వానించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రహల్లాద రావు బుధవారం అక్కడికి చేరుకొని స్వామీజీకి ఆహ్వాన పత్రికను అందించారు.