AP: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇక నుంచి శని, ఆది, సోమవారాలతో పాటు రద్దీ ఉన్న రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనం, ముఖ మండపంలో కుంకుమార్చనలు నిలిపివేస్తూ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో ఈ సేవల టికెట్లు తక్షణమే నిలుపుదల చేయాలని ఈవో ఆదేశించడం సంచలనంగా మారింది.