AP: నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు, మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం ఈవో అన్నపూర్ణ భవన్‌ను సందర్శించారు. అన్నప్రసాదంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.