తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అలాగే, 25 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున స్వామి వారికి పంచామృతాలతో ప్రాతః కాలం పూజలు నిర్వహించారు. భాను వాసరే పంచమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సెలవు దినం కావడంతో జిల్లాలోని నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చి తమ ఆరాధ్య దేవుణ్ణి దర్శించుకుంటున్నారు.
CTR: భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అని భక్తుల నమ్మకం. ఆదివారం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లికి గ్రామ బోనాల సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. మార్చి నెలలో జరిగే గంగమ్మ జాతరను తలపించేలా ఈ గ్రామ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
CTR: పిచ్చాటూరు మండలం వెంగళత్తూరులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా శనివారం సాయంత్రం గణనాథునికి పంచామృతములతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామి వారికి ప్రీతిపాత్రమైన గరిక మాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ధూపదీప నైవేద్యములు సమర్పించి పంచహారతులు అందజేశారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం పంచమి: రా. 9-21 తదుపరి షష్ఠి భరణి: ఉ. 6-32 కృత్తిక తె. 5-23 తదుపరి రోహిణి వర్జ్యం: సా. 5-57 నుంచి 7-28 వరకు అమృత ఘడియలు:.రా. 3-05 నుంచి 4-37 వరకు దుర్ముహూర్తం: సా. 4-19 నుంచి 5-07 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 5.52; సూర్యాస్తమయం: సా.5.56.
CTR: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం సంకటహర గణపతి వ్రతం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం సామూహికంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
TPT: తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం సాయంత్రం కాణిపాకం లడ్డు పోటులో తనిఖీలు నిర్వహించారు. నెయ్యి నిల్వ, తయారీ విధానం గురించి ఆరా తీశారు. నెయ్యిని క్వాలిటీ టెస్టింగ్ కొరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ సెంటర్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు.
TPT: కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
CTR: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 28న రక్షాబంధనం, పవిత్ర ప్రతిష్ఠ, 29న స్నపన తిరుమంజనం, 30న హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి.
TPT: పెరటాసి మాసం మొదటి శనివారం సందర్భంగా జిల్లాలోని పలు వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు పిండి దీపాలను పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామి వారు దేవేరులతో కలసి తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
AP: టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి తెలంగాణ విజయ డెయిరీ సిద్ధం అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డెయిరీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు TTD ఈవో శ్యామలరావుకు లేఖ అందించింది. దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయడెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని.. ...
కలియుగంలో ‘కలౌ వేంకటనాయక’ అన్నారు కదా! అందుకే శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటిరాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు.. అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. లడ్డూ తయారీలో సెనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండుద్రాక్ష.. తదితర పదార్థాలు విన...
రెండవ దేవరాయల కాలంలో తిరుమల భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం.. తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. 1803లో బ్రిటిషువారు ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. 1940ల్లో మిరాశీదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ ఇచ్చిన లడ్డూ ప్రసాదానికి ...
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ వాసి మనోజ్ మహేశ్ రెడ్డి బంగారు తాపడాన్ని విరాళంగా ఇచ్చారు. అనంతరం ఆయనకు అర్చకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
KDP: బద్వేలు పట్టణ పరిధిలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పూజారులు ఉత్సవ మూర్తులను వివిధ రకాల వస్త్రాలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.