TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.5,35,41,432 వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం హాల్ రెండులో హుండీ లెక్కింపు చేశారు. మిశ్రమ బంగారం 215 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 23,248 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినట్లు పేర్కొన్నారు.