NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం గణపతి పూజ, పుణ్యవచనం, కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మురళి గురుస్వామి, శివయ్య గురుస్వామి, రమేష్ గురుస్వామి, కోటేష్ గురుస్వామి, మల్లేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.