ADB: తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని హరి హర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములు బుధవారం అరట్టు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూల మాలలతో అందంగా ముస్తాబు చేసి స్వామి వారిని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గ్రామంలోని పురవీధుల గుండా డీజే చెప్పుల్ల నడుమ నృత్యలు చేస్తూ స్వామి వారి పల్లకిని ఊరేగింపు చేసారు.