శ్రీకాకుళం జిల్లా నర్సంపేట పట్టణంలో గల సిద్ధాశ్రమంలో బుధవారం జరిగిన అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ఎంపీపీలు వైసీపీ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షల విరమణకు చివరిరోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక తలనీలాలశాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం మార్చి కోటా టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. 27న శ్రీవారి సేవా కోటా టికెట్లు రిలీజ్ కానున్నట్లు పేర్కొంది.
NLR: దగదర్తి పట్టణంలోని శ్రీదుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. భక్తులు స్వామి, అమ్మవార్లును దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
SKLM: పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవాలయంలో కాలభైరవ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పుర వీధుల్లో తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం దశమి: రా. 9-24 తదుపరి ఏకాదశి చిత్త: మ. 3-07 తదుపరి స్వాతి వర్జ్యం: రా. 9-18 నుంచి 11-04 వరకు అమృత ఘడియలు: ఉ. 8-01 నుంచి 9-48 వరకు దుర్ముహూర్తం: ఉ 11-37 నుంచి 12-21 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.31; సూర్యాస్తమయం: సా.5.28.
AP: నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో జనవరి 1న స్వామివారి స్పర్శదర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఆ రోజు అలంకార దర్శనాలు కల్పిస్తామన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
SKLM: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
SKLM: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
VZM: ఉత్తరాంధ్ర భక్తులు ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణ భరణములతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని దొరువు వద్ద గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో ఈశ్వరిదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. జగన్మాత ఈశ్వరిదేవి 235వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈశ్వరి దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.
VSP: విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారిని నగర మేయర్ హరి వెంకట కుమారి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మేయర్ దంపతులకు ఆలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
HYD: బోరబండ సైట్- 2 కాలనీలోని హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవస్థానంలో వార్షిక మండల పూజలు మంగళవారం ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ జి. లక్ష్మణ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి హోమం, అయ్యప్పస్వామికి అభిషేకం, లక్ష పుష్పార్చన, 108 కలశాలతో రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ఉంటాయన్నారు. భక్తులు పాల్గొనవచ్చునన్నారు.
AP: తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఈవో, అదనపు ఈవో అభినందించారు.