శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం చతుర్దశి: తె. 3-36 తదుపరి అమావాస్య జ్యేష్ఠ: రా. 11-28 తదుపరి మూల వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ. 2-06 నుంచి 3-48 వరకు దుర్ముహూర్తం: సా. 4-03 నుంచి 4-47 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.34; సూర్యాస్తమయం: సా.5.31 మాస శివరాత్రి.
KDP: వీరబల్లి మండల పరిధిలోని పుత్తవాండ్లపల్లిలో వెలసిన పాలకొండ వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
KDP: వల్లూరు మండలంలోని దుగ్గాయపల్లెలో వెలసిన శ్రీ గంగమ్మ, దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో శనివారం మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయాల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు జరిగి 41 రోజులు పూర్తైన సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలను నిర్వహించారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువ జమున స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సుగంధద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
BDK: భద్రాద్రి రాములవారికి HYD వాస్తవ్యులు రూ. 40 లక్షలు విలువ చేసే రత్నాంగి కవచాలను విరాళంగా ఆలయ ఈవో రమాదేవికి శనివారం అందజేశారు. ఈ కవచాలల్లో 51 వేల రత్నాలు ఉన్నాయని ఈవో తెలిపారు. దాతలు పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. అలాగే స్వామివారిది తీర్థప్రసాదాలు అందజేశారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం శని త్రయోదశి విశిష్టమైన రోజు కావడంతో ఆలయంలోని నవగ్రహాలకు శనీశ్వరునికి భక్తులు విశేష పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా చేస్తూ భక్తులు కోరిన కోరికలు నెరవేరే విధంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
W.G: ధనుర్మాసం సందర్బంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మరుధూరి శ్రీనివాస్, పవన్ కుమార్, నర్సింహాచార్యులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
Akp: మాడుగుల మండలంలో ఎం.కోడూరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన ఎన్నెటీ కొండలరావు అమ్మవారి పాదాల నిమిత్తం రూ.10వేలు శుక్రవారం అందజేశారు. ఈ నగదును ఆలయ ఛైర్మన్, సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు అందించారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా సంజీవరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రమణబాబు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలోని నగర పాలక సంస్థ మైదానంలో అష్టలక్ష్మి సహిత పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయ గణపతి ఆలయం అర్చకులు పెంటశ్రీధర్ శర్మ, విజయదుర్గాదేవి ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణశర్మ తెలిపారు. ఈనెల 29వ తేదీన కోటి దీపోత్సవం, శ్రీనివాస బంగారయ్యశర్మ ప్రవచనం ఉంటుందని వారు పేర్కొన్నారు.
NLR: వేదాయపాలెంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన నగరోత్సవం కనులవిందు చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షులు జీ శేషగిరిరావు నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి మొదలైన ఈ ఉత్సవం నవాబుపేట శివాలయం అందరు ప్రాంతాల్లో వైభవంగా జరిగింది.
MHBD: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 06/08/2024-25/12/2024 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు తెలిపారు. వీరభద్ర స్వామి ఆదాయం రూ. 28,32577 కాగా, భద్రకాళి అమ్మవారి ఆదాయం రూ. 10,71452 మొత్తం రూ. 39 లక్షల పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. అలాగే బంగారు, వెండిని హుండీలో భద్రపరిచామన్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
GDWL: జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, ప్రత్యేక అలంకరణ చేసి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేశారు. మండల పూజలు ముగియటంతో దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇప్పటివరకు 32.50 లక్షల మంది అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 30న ఆలయం మళ్లీ తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.
శ్రీ సత్యసాయి: పెనుగొండ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాలో బాబా ఫక్రుద్దీన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.