పార్వతీపురంమండలంలోని తాళ్లబురిడి గ్రామంలో ఆరవిల్లి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు అయ్యల స్వామి యాజుల శ్రీనివాసశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు బసవ రాజుల పర్యవేక్షణలో శివాలయ ప్రతిష్ట పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయపునఃప్రతిష్ట పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.