ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస పూజలను ప్రత్యక్షంగా వీక్షించుటకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామిని కనులారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది
GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తెల్లవారుజాము నుంచే తిమ్మప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు ధ్వజ స్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టి ముడుపులు చెల్లించుకున్నారు.
SRPT: సిరిపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. శనివారం ఆరో రోజు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకు పూజతో పాటుగా, గోదాదేవి అమ్మవారికి కుంకుమ సహస్రనామార్చన, తిరుప్పావై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. జనవరి 14న గోదా కళ్యాణంతో పూజలు ముగుస్తాయని అర్చకులు వేదాంతం చక్రధరాచార్యులు తెలిపారు.
VSP: పాత డెయిరీ ఫారం కూడలిలోని పైడితల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి, కుంకుమార్చన జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు గోపీశర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 65,299 మంది భక్తులు దర్శించుకోగా.. 20,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం షష్ఠి: మ. 1-40 తదుపరి సప్తమి పుబ్బ: పూర్తి వర్జ్యం: మ. 2-28 నుంచి 4-12 వరకు అమృత ఘడియలు: రా. 12-47 నుంచి 2-30 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-28 నుంచి 7-56 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 6.29; సూర్యాస్తమయం: సా.5.26
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉండే ఇబ్బంది లేకుండా గంటలోనే దర్శనం అయ్యేలా చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు చేపట్టే పైలట్ ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టారు. గంటలోపు దర్శనం పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ నెల 24న జరగిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోద ముద్ర వేస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో, 20 డిసెంబర్ 2024 శుక్రవారం రోజు ఉదయం, అయ్యప్ప మాలదారులు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేశారు. తదుపరి స్వామి వారిని పూలమాలతో అలంకరించారు. 18 మెట్లపై పూలు పెట్టారు. దీపారాధన చేసి స్వామివారిని పూజించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేసి, శబరిమల బయలుదేరారు.
BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లికి ఈరోజు ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
PLD: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం బండ్లమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు చీర, బంగారు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు నైవేద్యాలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు.
ATP: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ధనుర్మాస పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తాదులు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం గావించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం వందలాది భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనాభిషేకంలో స్వామివారు భక్తులకు కనువిందు చేశాడు. అంతకుముందు స్వామివారికి పంచామృతా, కుంకుమార్చనలు తోమాల సేవ తదితర పూజలు నిర్వహించారు.
KRNL: రాష్ట్రంలోని మసీదులలో పనిచేసే ఇమామ్, మోజన్లకు గౌరవవేతనాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 131 జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. అమరావతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10వేలు, మోజన్లకు రూ. 5వేల వేతనాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ నరసాపూర్ శివారులోని కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయం వద్ద వేలం పాటలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద 11 రకాలకు సంబంధించిన వాటికి వేలం పాట వేయనున్నామన్నారు. వేలం పాటల్లో డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని ఈవో సూచించారు.