E.G: అంతర్వేది కళ్యాణ ఉత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని, అమలాపురం నుంచి మలికిపురం వరకు కాకుండా అమలాపురం నుంచి అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శిరంగు నాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.
AP: ఫిబ్రవిరి 4న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భద్రత, జన రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు. విజిలెన్స్, సెక్యూరిటీ, వివిధ భాగాల అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని జన రద్దీని అంచనాలు వేసి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని అమ్మవారికి నెయ్యి దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ATP: గుంతకల్లు మండలం కొంగనపల్లిలో ఈనెల 22న బుధవారం జాతర మహోత్సవం ఉంటుందని గ్రామ ప్రజలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పెద్దమ్మ తల్లి, సుంకులమ్మ అమ్మవార్లకు భోనాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు వివిధ ప్రాంతాల వారు వచ్చి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
SRPT: సూర్యాపేటలో బొడ్రాయి బజార్ వద్ద వేదాంత భజన మందిరంలో శనివారం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం, సీతారామచంద్ర మాస కళ్యాణ, మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
MDK: జిల్లా పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని గరగాలమ్మ దిబ్బ నందు వెంచేసియున్న శ్రీ గరగాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసే ఆశీర్వచనాలు ఇచ్చారు.
W.G: మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ ఆంబోతుతిప్పలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం ఆలయ ఆవరణలో భక్తులచే అర్చకులు అభిషేకాలు చేయించారు. ఆలయ ప్రాంగణంలో స్వాములు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి శ్రీరామ అలంకరణ చేసి, శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం పుష్యర్కం సందర్భంగా ఆలయంలోని యాగశాలలో ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పంచసూక్తములు, మాన్య సూక్త హోమలు, నిర్వహించారు. ముందుగా వేకువజామున ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి భక్తులను ఆశీర్వదించారు.
TG: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శ్రీకృష్టుడి అవతారంలో సీతారామచంద్ర స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం గోదావరి నదీ తీరాన హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 10న ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు.
MDK: పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల దేవాలయంలో వన దుర్గా భవాని మాతకు ఆదివారం వేకువజాము నుండి అర్చకులు పార్థివ శర్మ భాను వాసరే ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల ఇలవేల్పు భవాని మాతకు ప్రత్యేక అలంకరణలతో విశేష అభిషేక పూజలు చేశారు. అనంతరం మంగళ హారతి, దీపం, గుగ్గిల ధూపం, నారికేళ, ఫల నైవేద్యం నివేదన చేశారు.
TPT: గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమరాయకొండ పై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జనవరి ఒకటో తేదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోజు ఉదయం స్వామి వారికి విశేష అభిషేకాలు, పుష్పాలంకరణ పూజలు అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు.