విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో మహోత్సవాలలో పాల్గొన్నారు. జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్ నీలమ్మ వేపచెట్టు వద్ద జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సీతంపేట జనసేన కార్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ వద్ద నిర్వహించిన కార్యక్రమాలలో స్వామి దర్శించుకున్నారు.
NTR: విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో వినాయక చవితి వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా హాజరయ్యారు.
NTR: జగ్గయ్యపేటలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ భాను పట్టణంలోని చెరుకూరు బజారులో వినాయకుని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఉదయ భాను యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ గణనాధునికి అర్చకులచే ప్రత్యేక పూజలు జరిపించారు.
W.G: పాలకొల్లు పట్టణంలో వాడవాడలా బుధవారం వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాలకొల్లు పాత పోలీస్ స్టేషన్ దగ్గర బంగారపు కోట్లు సెంటర్ నందు బంగారపు కోట్లు అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
NLR: బద్దెవోలులోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న మహా గణపతికి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో మహాగణపతికి పంచామృతాభిషేకం చేసి, నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గణపతి ఆశీస్సులు పొందారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,837 మంది భక్తులు దర్శించుకోగా.. 21,510 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
విఘ్నాధిపతిని కొలవడం ద్వారా విఘ్నాలన్నీ తొలగి అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం. ఊరువాడ అంతా ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే, గణపయ్యను పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తి, అరటిపండ్లు, మామిడి ఆకులు, దారం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నూనె, దీపారాధనకు వత్తులు, తమలపాకులు, పూలు, కొబ్బరికాయ, అక్షితలు, కలశం కోసం చెంబు, 21 రకాల పత్రితో పూజించాలి.
AP: వచ్చే నెల 7న శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు చెప్పింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం క్లోజ్ చేస్తామని పేర్కొంది. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని వెల్లడించారు.
TG: హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో అక్కడి గణనాథుడు దర్శనమిస్తాడు. ఈ వినాయకుడికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. 1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు లోకమాన్య బాలగంగాధర తిలక్ పిలుపునిచ్చారు. అయితే ఖైరతాబాద్‌లో మాత్రం 1954లో ఒక్క అడుగుతో గణేశుడిని ప్రారంభించారు.
మనం ఏ పూజ చేసినా ప్రథమంగా వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడంటే తెలియని వారుండరు. కానీ, వినాయకి అనే దేవత గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అంధకాసురుడిని సంహరించేందుకు శివుడికి సాయం చేయడానికి వినాయకుడి నుంచి ఉద్భవించిన స్త్రీ రూపమే వినాయకి. ఈమెను గజానని, విఘ్నేశ్వరి అని పిలుస్తారు. ఈమెకు ఏనుగు తల, స్త్రీ శరీరం ఉంటాయి. రాజస్థాన్, MP, ఒడిశా, TNలో వినాయకి విగ్రహాలు దర్శనమిస్తాయి.
GDWL: జమ్మిచేడులో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి, పట్టువస్త్రాలు మరియు బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజరాజేశ్వర స్వామి వారి భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ATP: రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. వేకువ జామునే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారికి వేప చీరలతో మొక్కుబడులు తీర్చుకున్నారు.
సత్యసాయి: కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఖాద్రీశునికి వెండిరథ ప్రాకారోత్సవం జరుగుతుంది. ఉదయం ఆరు గంటలకు భక్తులకు దర్శనం కల్పించి, ఏడు గంటలకు స్వర్ణ కవచ, అభిషేక పూజలు ఉంటాయి. ఉదయ 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు శ్రీవారి సర్వదర్శనం నిర్వహిస్తారు.