KMM: జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, ఆంజనేయ మాలదారులు భక్తులు పాల్గొన్నారు.
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీక మాసం పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ సహాయ కమిషనర్ ఎస్.అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న రాత్రి కార్తీక సోమవారం పురస్కరించుకొని పద్మ కమలం ఆకారంలో దీపోత్సవం నిర్వహించారు.
AP: ప్రముఖ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని దర్శనార్థం భక్తులు భారీగా వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్ని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి నామస్మరణలతో మార్మోగాయి. భక్తులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో సారె సమర్పించి, స్వామి అమ్మవా...
ATP: పామిడి పట్టణంలోని ప్రసిద్ధ శివ క్షేత్రమైన శ్రీ భోగేశ్వర స్వామి శివాలయంలో కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణంలో కార్తీకమాస దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో శివాలయం మారుమోగింది.
KDP: కనుమలోపల్లిలో వెలసిన శ్రీ ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సోమా బాబు ఆధ్వర్యంలో మహాలింగ్వేరస్వామికి రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
GDWL: కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, మల్దకల్, ఉమామహేశ్వరం, అలంపురం, మన్యంకొండ వంటి పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు రద్దీ నెలకొంది. సంబంధిత దేవస్థానాలు ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేసి, భక్తులను దర్శనానికి క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
AP: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఇవాళ ఉదయం 10.15 గంటలకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడి అధ్యక్షతన ప్రారంభం అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా పాలకమండలి ఏర్పడటంతో సమావేశానికి ప్రాధాన్యమేర్పడింది. సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లు, సనాతన ధర్మ పరిరక్షణ తదితర 80 అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటిని అందుబాటులోక...
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, బహుళపక్షం తదియ: రా. 10-04 తదుపరి చవితి మృగశిర: రా. 7-27 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: తె. 3-43 నుంచి 5-17 వరకు అమృత ఘడియలు: ఉ. 10-55 నుంచి 12-28 వరకు దుర్ముహూర్తం: మ. 12-07 నుంచి 12-52 వరకు తిరిగి 2-22 నుంచి 3-06 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 6.10; సూర్యాస్తమయం: సా.5.21.
NTR: గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీ రుద్ర సహత మృత్యుంజయ హోమం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, వేద పండితులు జానకి రామాచార్యులు ముందుగా రామలింగేశ్వర స్వామికి అభిషేకం, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మృత్యుంజయ మూలమంత్రం పారాయణం చేస్తూ ఆవు నెయ్యి, హోమ ద్రవ్యాలు హోమ గుండంలో సమర్పించారు.
KDP: వల్లూరు మండలంలోని దుగ్గాయపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి, దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దేవతా మూర్తుల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర మాజీ ఛైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.
CTR: పుంగనూరు మండలం కొండపై దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు వేద పారాయణం, ఏకవార రుద్రాభిషేకం, పసుపు, కుంకుమ, విభూది, చందనములతో అభిషేకించారు. తర్వాత స్వామివారికి నారికేల దీపాలు సమర్పించి, రుద్రహోమాలు అర్చకులు నిర్వహించారు.
AP: నేడు తిరుమలలో కార్తీక వనభోజనం నిర్వహించనున్నారు. వర్ష సూచన దృష్ట్యా వనభోజనం నిర్వహణ వేదిక మార్పు చేసినట్లు తెలుస్తుంది. పార్వేట మండపానికి బదులుగా వైభవోత్సవ మండపంలో వనభోజన కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహనంపై వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి చేరుకోనున్నారు. కార్తీక వనభోజనం సందర్భంగా పలు ఆర్జీత సేవలను అధికారులు రద్దు చేశారు.
దివ్యాంగులకు తిరుమల స్వామి వారి దర్శనం చేయించాలనే లక్ష్యంతో శ్రీ అష్టోత్తర శతచుక్కల ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ట్రస్ట్ ఛైర్మన్ వేణు చుక్కల 27న ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయడుని కలిసి దర్శన యాత్ర కర పత్రాన్ని అందించి సహకరించాలని కోరారు. 399 మందిని దర్శనానికి తీసుకొస్తామని తెలిపారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, బహుళపక్షం విదియ: రా. 11-26 తదుపరి తదియ రోహిణి: రా. 8-12 తదుపరి మృగశిర వర్జ్యం: మ. 12-34 నుంచి 2-05 వరకు: తిరిగి రా. 1-37 నుంచి 3-10 వరకు అమృత ఘడియలు: సా.5-09 నుంచి6-40 వరకు; దుర్ముహూర్తం: సా. 3-51 నుంచి 4-36 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.09; సూర్యాస్తమయం: సా.5.21
TG: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి...