NLR: సంగంలోని శ్రీ వెంకయ్య స్వామి గుడిలో ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో శ్రీ వెంకయ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.